Mana tiruvuru

Call Directions Website Contact the business

Mana tiruvuru Hi sir/Madam This page importance to all tiruvuru constancy updates available for all peoples

30/09/2026

*తిరువూరులో భూ వివాదంలో కొత్త మలుపు*

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రాంతంలో సర్వే నంబర్ 202/1బి 17కు సంబంధించిన భూ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భూ విక్రయాలు, హక్కులకు సంబంధించి ఇరువర్గాలు పరస్పరం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

వారసత్వంగా భూమి తమ కుటుంబానికి వస్తుందని పేర్కొంటున్న షేక్ మౌలాలి కుటుంబ సభ్యుల ప్రకారం.. భూమిని షేక్ మౌలాలి నుంచి ఆలపాటి శ్రీనివాసరావుకు రిజిస్ట్రేషన్ చేయగా, అనంతరం ఆలపాటి శ్రీనివాసరావు నుంచి ధనికొండ అప్పారావుకు విక్రయం జరిగినట్లు తెలిపారు.

మరోవైపు చిలపరపు హేమలత కుమార్తె సుహాసిని ఈ భూమిపై తనకే హక్కు ఉందని పేర్కొంటూ ఇటీవల ప్రెస్‌మీట్ నిర్వహించినట్లు సమాచారం. ఈ సందర్భంగా భూమికి సంబంధించిన తన హక్కు, వాదనలకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ధనికొండ అప్పారావును ఉద్దేశించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయిస్తామని బెదిరింపులు చేస్తున్నారని అప్పారావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించినట్లు వారు తెలిపారు. ఈ వ్యవహారంపై తిరువూరు పోలీస్ స్టేషన్‌లో చర్చ జరిగినట్లు సమాచారం.

భూమి ప్రస్తుతం ఎవరి పేరుపై ఉంది? గతంలో ఎవరెవరికి విక్రయాలు జరిగాయి? ఆయా లావాదేవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, హక్కు పత్రాల చెల్లుబాటు ఎంతవరకు ఉంది? ప్రస్తుతం చట్టపరమైన హక్కు ఎవరికి ఉంది? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో సంబంధిత రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు భూమికి సంబంధించిన రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి, ఇరువర్గాల వాదనలు నమోదు చేసి వాస్తవాలను నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు.

భూమి హక్కుకు సంబంధించిన వివాదంలో ఎవరి వాదన వాస్తవమో అధికారిక రికార్డులు, చట్టపరమైన విచారణ ద్వారానే తేలాల్సి ఉంది. అధికారులు స్పందించి వివాదానికి చట్టపరమైన పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

29/09/2026

_ఎన్టీఆర్ జిల్లా,_
_తిరువూరు నియోజకవర్గం,_
_ది.26-09-2026._

*_తిరువూరు పట్టణ పరిధిలోని ఏడు సాగునీటి చెరువులకు రాకెట్ సప్లై ఛానల్ ద్వారా నీటి సరఫరా కల్పించేందుకు విజ్ఞప్తి.._*

_గౌరవ జల వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని కలిసి, తిరువూరు నియోజకవర్గంలోని సాగునీటి సమస్యల పరిష్కారానికి సంబంధించి గౌరవ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు విజ్ఞప్తి చేశారు._

_తిరువూరు పట్టణ పరిసరాల్లోని కంగుల చెరువు, మల్లమ్మ చెరువు, గుంటు & పోతుల చెరువులు, సోమకుంట చెరువు, కొత్త చెరువు, దేవసముద్రం చెరువు సహా ఏడు సాగునీటి చెరువులు సుమారు 1,680 ఎకరాల ఆయకట్టుకు, దాదాపు 1,005 మంది రైతులకు సాగునీరు అందిస్తున్నాయని లేఖలో వివరించారు._

_ప్రస్తుతం ఈ చెరువులు ప్రధానంగా వర్షాధారంగా ఉండటంతో, వర్షపాతం తక్కువగా ఉన్న సమయాల్లో ఆయకట్టు భూములకు సాగునీటి కొరత ఏర్పడుతోందని తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఇప్పటికే ఉన్న సుమారు 6.5 కిలోమీటర్ల రాకెట్ సప్లై ఛానల్ ద్వారా ఈ చెరువులకు నీటిని అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు._

*_రాకెట్ సప్లై ఛానల్‌కు అవసరమైన సిమెంట్ కాంక్రీట్ లైనింగ్, గట్ల బలోపేతం తదితర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని గౌరవ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు కోరారు._*

29/09/2026

That is mla of tiruvuru

29/09/2026

*ఎం వి ఎస్ ఫౌండేషన్ (మామిడి వెంకట శాస్త్రి) హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి చేయూత......!*

*********************

*ఎన్టీఆర్ జిల్లా*

*ఏ కొండూరు మండలం*

*పోలిశెట్టిపాడు గ్రామం*

*ప్రమాదపుశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కొమ్ము వెంకటేశ్వరావు ఇల్లు పూర్తిగా దగ్ధమైన కారణంగా కట్టు బట్టలతో వారు ఉండగా సదరు ఈ విషయమై గ్రామ మాజీ సర్పంచ్ బొల్లెపోగు చిట్టిబాబు మరియు ఎంవిఎస్ ఫౌండేషన్ & హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ సెక్రటరీ బి వి ఆర్, గొల్లమందల మహేష్ మామిడి బ్రదర్స్ నరేంద్ర (నాని)& సురేంద్ర (నాని)కి తెలపగా వెంటనే స్పందించిన మామిడి బ్రదర్స్ తన వంతు తక్షణసాయంగా రైస్ బ్యాగులు & నిత్యవసర సరుకులు మరియు నూతన వస్త్రములు గ్రామ మాజీ సర్పంచ్ చిట్టిబాబు చేతుల మీదగా బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది....*

*ఈ కార్యక్రమంలో ఎం వి ఎస్ ఫౌండేషన్ టీం నరేంద్ర (నాని) & సురేంద్ర (నాని) సభ్యులు మామిడి ఆనంద్, గుంజ శివకుమార్ (వెంకీ) బాజీవలి, పవన్ కిరణ్, సుభాని, ఆనంద్, లక్ష్మణ్, యశ్వంత్, చైతన్య, మాజీ సర్పంచ్ చిట్టిబాబు,హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ సెక్రటరీ బి వి ఆర్, గొల్లమందల మహేష్ , సమైక్య ప్రెస్ క్లబ్ & హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ అధ్యక్షులు మద్దిబోయిన నరేష్ తదితరులు పాల్గొన్నారు....*

*సమస్య చెప్పిన వెంటనే తక్షణం స్పందించి మేమున్నానంటూ భరోసాగా తన వంతు సహాయంగా సాయం అందించిన ఎం వి ఎస్ ఫౌండేషన్ హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ మామిడి బ్రదర్స్ నరేంద్ర (నాని) & సురేంద్ర (నాని)కి గ్రామ మాజీ సర్పంచ్ చిట్టిబాబు , సెక్రటరీ బి వి ఆర్, గొల్లమందల మహేష్, మరియు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలిపారు...*

29/09/2026
సార్ ఆంధ్రప్రదేశ్ లో కూడా మీ పార్టీ అధికారంలోకి రావాలి సార్ 🙏🙏🙏🙏jai భీమ్ జై thalapathy
29/09/2026

సార్ ఆంధ్రప్రదేశ్ లో కూడా మీ పార్టీ అధికారంలోకి రావాలి సార్ 🙏🙏🙏🙏jai భీమ్ జై thalapathy

29/09/2026

32 ఏళ్లుగా అనాథలు, వృద్ధులకు అండగా మహర్షి రమణ ఆశ్రమం

తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా: గత 32 సంవత్సరాలుగా తిరువూరులో మహర్షి రమణ ఆశ్రమాన్ని స్థాపించి, అనాథ పిల్లలు, వృద్ధులు, నిరాశ్రయులు, దృష్టిలోపం ఉన్నవారు, దివ్యాంగులకు ఆశ్రయం కల్పిస్తూ సేవలు అందిస్తున్నామని ఆశ్రమ నిర్వాహకులు వెంపాటి అబ్రహం మణిరత్నం తెలిపారు.

ఆశ్రమం స్థాపించిన నాటి నుంచి ఇప్పటివరకు దాతలు అందిస్తున్న సహాయ సహకారాలతో ఆశ్రమంలోని వారికి అవసరమైన మందులు, వైద్య సేవలు, ఆహారం తదితర సదుపాయాలను కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఆశ్రమంలో ఉన్న పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో వారి విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి చదివిస్తున్నామని తెలిపారు. పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి తమ జీవితాల్లో స్థిరపడేలా చేయడం ఆశ్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు.

ప్రస్తుతం ఆశ్రమానికి మరిన్ని మౌలిక సదుపాయాలు, విద్యా సహాయం, వైద్య సహాయం మరియు ఇతర అవసరాలు ఉన్నాయని అబ్రహం మణిరత్నం తెలిపారు. దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి ఆశ్రమానికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

“ఆశ్రమంలోని పిల్లలకు మంచి భవిష్యత్తు అందించేందుకు ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరం. దాతలు ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సహాయం అందించాలని కోరుతున్నాం” అని అబ్రహం మణిరత్నం తెలిపారు.

26/09/2026

*వారం రోజుల్లో ఇద్దరి మృతి.. ఎంవీఎస్ ఆసుపత్రి సీజ్*

_ఎన్టీఆర్ జిల్లా_ : -

_తిరువూరు పట్టణంలోని ఎంవీఎస్ సర్జికల్ అండ్ మెటర్నిటీ నర్సింగ్ హోమ్‌ను *ఆర్డీఓ ఏ.కుమార్* సీజ్ చేశారు_ .

_వారం రోజుల్లో ఇద్దరు పేషెంట్లు మృతి చెందడం, ఆసుపత్రి వైద్యుడిపై పలు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు *ఆర్డీఓ ఏ.కుమార్* తెలిపారు_ .

_ఈ విషయంపై డీఎంహెచ్‌ఓకు లిఖితపూర్వకంగా సమాచారం పంపినట్లు పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆసుపత్రిలో కొత్త పేషెంట్లను చేర్చుకోవద్దని, చికిత్స చేయవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్డీఓ తెలిపారు_ .

Address

Bosubomma Centre
Tiruvuru
521235

Alerts

Be the first to know and let us send you an email when Mana tiruvuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mana tiruvuru:

Shortcuts

Share